సేతుపతి ఇంట్రెస్టింగ్ సినిమా అప్పుడే మొదలట.!

Published on Apr 28, 2021 7:03 am IST

ఒక్క కోలీవుడ్ లోనే కాకుండా తన నటనతో మొత్తం దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇప్పటికే ఎన్నో అద్భుత పాత్రలు చేస్తూ మరోపక్క తాను కూడా మెయిన్ లీడ్ లో నటిస్తూ వస్తున్నాడు. మరి ఇప్పుడు అలా మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు.

అదే మేరీ క్రిస్టమస్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూట్ ఎప్పుడు మొదలు కానుందో ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రం షూట్ వచ్చే మే నెల నుంచి గోవాలో మొదలు కానుందట. మరి ఈ చిత్రంపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :