రేపు తెలుగు బాక్సాఫీస్ పై ఏడు సినిమాల దండయాత్ర.

Published on May 23, 2019 11:06 am IST

రేపు తెలుగు రాష్ట్రాల సినిమా థియేటర్స్ కొత్త సినిమాల విడుదలలో కళకళలాడనున్నాయి. రేపు ఏకంగా ఒకేసారి 7 సినిమాలు విడుదలకు సిద్ధమైనాయి.వీటిలో కొన్ని డైరెక్ట్ తెలుగు మూవీస్ కాగా కొన్ని అనువాద చిత్రాలు. వేసివి సెలవు ఇంకొద్ది రోజులలో ముగియనుండటంతో చిత్ర నిర్మాతలు తమ చిత్రాల విడుదలకు తొందరపడుతున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జోడీగా తేజ తెరకెక్కించిన “సీత”, అంజలి ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ మూవీ”లిసా 3డి”, లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ లగడపాటి హీరోగా చేస్తున్న “ఎవడు తక్కువకాడు” మరో చిన్న తెలుగు సినిమా “నేను లేను” తో పాటు, జై , క్యాథెరిన్ , రాయ్ లక్ష్త్మి
నటించిన తమిళ అనువాద మూవీ “నాగ కన్య”, విల్ స్మిత్ నటించిన ఆంగ్ల అనువాద చిత్రం “అల్లావుద్దీన్” నరేంద్ర మోడీ బయో పిక్ “నరేంద్ర మోడీ” కూడా రేపు విడుదల కానున్నాయి.

ఐతే వీటిలో “సీత” “అల్లావుద్దీన్” మూవీస్ పై అంచనాలు ఉన్నాయి. అన్ని దాదాపు చిన్న సినిమాలు కావడంతో థియేటర్స్ సమస్య వచ్చే ఆస్కారం లేదు.

సంబంధిత సమాచారం :

More