అలవాటు లేకుండా ఆ పాత్రలు చేయడం కష్టం- షాహిద్

Published on Aug 2, 2019 6:00 pm IST

‘అర్జున రెడ్డి’ హిందీ రీమేక్ గా వచ్చిన “కబీర్ సింగ్” ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే.షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరక్కెక్కించగా, ‘కబీర్ సింగ్’ 280 కోట్ల వసూళ్లు వరకు సాధించి రికార్డ్ సృష్టించింది. ప్రేమ విఫలమై దేవదాసుగా మారి చెడు వ్యసనాలకు బానిసైన యువకుడి పాత్రలో షాహిద్ కపూర్ అద్భుతంగా నటించారు. ఆల్కహాల్ అడిక్ట్ గా తన నటన గురించి షాహిద్ ని సంప్రదించగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

స్మోకింగ్, డ్రింకింగ్ అస్సలు అలవాటులేని నాకు అలాంటి పాత్ర చేయడం చాలా కష్టమైంది అన్నారు. ఎందుకంటే తాగుడు అలవాటు లేని,నాకు ఒక తాగిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు అన్నారు. అందుకోసం చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది అన్నారు. అందుకే “కబీర్ సింగ్”,” ఉడ్తా పంజాబ్” చిత్రాలలో నాపాత్రలు నాకు ఛాలెజింగ్ గా అనిపించాయి అన్నారు.

సంబంధిత సమాచారం :