బ్లాక్ బస్టర్ కొట్టినా బ్యాంకు బ్యాలన్స్ సేమ్ అంటున్న షాహిద్.

Published on Jul 26, 2019 6:54 pm IST

షాహిద్ కపూర్ “కబీర్ సింగ్” మూవీతో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు సాధించింది. 50కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఏకంగా 275కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తరువాత షాహిద్ మార్కెట్ విపరీతంగా పెరిగిందని, ఆయన కూడా 40కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

నా రెమ్యూనరేషన్ పై వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని చెప్పిన షాహిద్ ,కబీర్ సింగ్ మూవీకి ముందు నా బ్యాంకు బ్యాలన్స్ ఎంతుందో ఇప్పుడూ అంతే ఉంది అన్నారు. కబీర్ సింగ్ వలన లాభపడింది నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే అన్నారు. ఇంత వరకు కబీర్ సింగ్ రెమ్యూనరేషన్ కూడా అందలేదు అన్నారు. ఈ మూవీని సినీ వన్ స్టూడియో, టి సిరీస్ నిర్మించగా, ఏఏ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :