ప్రభాస్, ఎన్టీఆర్ లు నా ఫేవరేట్ – క్రికెటర్ షమీ

ప్రభాస్, ఎన్టీఆర్ లు నా ఫేవరేట్ – క్రికెటర్ షమీ

Published on Feb 19, 2024 6:03 PM IST

బాహుబలి చిత్రం తో టాలీవుడ్ సినీ పరిశ్రమ యొక్క రూపు రేఖలు మారిపోయాయి. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చాలా ఫెమర్ అయ్యారు. ఈ నేపథ్యం లో క్రికెటర్ షమీ చేసిన వ్యాఖ్యలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల తన ఫేవరేట్ హీరోలు ఎవరు అని అడగగా, అందుకు బదులుగా ప్రభాస్, ఎన్టీఆర్ ల పేర్లను తెలిపారు. ఒక పక్క ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరొక పక్క ఎన్టీఆర్ దేవర, వార్ 2 చిత్రాల తో బిజీ కానున్నారు. టాలీవుడ్ నుండి ఈ హీరోలకు దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పండింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు