చెర్రీ, శంకర్‌ల బిగ్ ప్రాజెక్ట్‌కు లొకేషన్స్ సెర్చ్..!

Published on Jul 27, 2021 2:30 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ కాంబోలో దిల్ రాజ్ బ్యానర్‌లో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే హై ఎక్స్‌పెక్టెషన్స్ నడుమ రూపుదిద్దుకునే ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొంటున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

అయితే ప్ర‌స్తుతం దర్శకుడు శంక‌ర్ హైద‌రాబాద్‌లోనే ఉండడంతో లొకేష‌న్ల కోసం సెర్చ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని ఓ పక్క ప్రచారం జరుగుతుంది. అయితే చరణ్‌ని కొత్త లుక్‌లో చూపించాల‌ని శంకర్ భావిస్తున్నాడని ఇందుకోసం రకరకాల గెటప్‌లని సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :