చరణ్ సినిమా నుంచి కమల్ సినిమాకి షిఫ్ట్ అయ్యిన శంకర్.!

Published on Aug 5, 2022 8:00 am IST


ఇండియన్ సినిమా దగ్గర జేమ్స్ కేమరూన్ గా నిలిచిన దర్శకుడు శంకర్ ఇప్పుడు మళ్ళీ తన మార్క్ సాలిడ్ సోషల్ డ్రామా చిత్రాలు టేకప్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ భారీ చిత్రం తమ కెరీర్ లో 15వ సినిమాగా స్టార్ట్ చేయగా 70 శాతం మేర ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

ఇక ఈ సినిమా నుంచి బ్రేక్ లో ఉన్న మేకర్స్ అయితే ఇపుడు సినిమా షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల షూటింగ్ స్ట్రైక్ ఉన్నందున శంకర్ కమల్ హాసన్ తో చేయనున్న భారీ చిత్రం “ఇండియన్ 2” సినిమా కూడా తమిళ్ లో స్టార్ట్ చేయనున్నారని.

టాలీవుడ్ లో షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో ఎవరికీ క్లారిటీ లేకపోవడంతో శంకర్ ఆ సినిమాకి ప్రస్తుతం షిఫ్ట్ అయ్యారని కన్ఫర్మ్ అయ్యింది. అలా తెలుగులో మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యాక అయితే అక్కడ నుంచి ఇక్కడకి వచ్చి శంకర్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేసి రెండు సినిమాలు బ్యాలెన్సుడ్ గా చేయనున్నారని ఇప్పుడు సమాచారం.

సంబంధిత సమాచారం :