RC 15..సాలిడ్ పోస్టర్ తో తన మ్యాజిక్ స్టార్ట్ చేసిన శంకర్!

RC 15..సాలిడ్ పోస్టర్ తో తన మ్యాజిక్ స్టార్ట్ చేసిన శంకర్!

Published on Sep 8, 2021 10:02 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ ల కాంబోలో అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఈరోజు లాంచ్ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఎంతో ఆసక్తి రేపుతూ వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నుంచి మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి దీనితో మళ్ళీ శంకర్ తనలోని విజనరీ అండ్ కొత్తదనాన్ని చూపించాడని చెప్పి తీరాలి.

సడెన్ గా చూస్తే రోబో పోస్టర్ లా అనిపించింది కానీ చూస్తే మాత్రం శంకర్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో చరణ్ కియారా సహా శంకర్ కూడా కనిపిస్తున్నారు అంతే కాకుండా మొత్తం అంతా ఒక కాస్ట్యూమ్ లో కనిపిస్తూ మొత్తం క్యాస్ట్ ని కూడా ఇందులో పొందుపరిచి రివీల్ చేశారు. మరి వీరిలో రవిబాబు, సునీల్, అంజలి తదితర టాలీవుడ్ నటులు అధికంగా కనిపిస్తున్నారు.

పైగా థమన్ సహా ఇతర టెక్నీకల్ సిబ్బంది కూడా కనిపించడం గమనార్హం.. రాజు బ్యానర్ లో వస్తున్న ఈ 50వ చిత్రం ఎంత ప్రిస్టేజియస్ గా కొత్తగా ఉండనుందో ఈ ఒక్క పోస్టర్ చెబుతుంది. మరి శంకర్ మరియు చరణ్ ల కెరీర్ లో కూడా ఇది 15వ సినిమాగా వస్తుంది.. మరి ఈ చిత్రం ఎలాంటి సబ్జెక్టు తో వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు