శంకర్ ‘ఇండియన్-2’ గొడవ మళ్ళీ మొదటికి

Published on Apr 30, 2021 1:00 am IST

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈమధ్య పలు వివాదాలతో సతమవుతున్న సంగతి తెలిసిందే. ‘ఇండియన్-2’ చిత్రంతో మొదలైన వివాదాలు ఇంకా కోనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమా విషయంలో మొదటి నుండి దర్శక నిర్మాతలకు సఖ్యత లేకుండా ఉంది. చెప్పిన బడ్జెట్లో సినిమా కంప్లీట్ చెయ్యలేదని లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు, అవసరమైనంత బడ్జెట్ ఇవ్వలేదని శంకర్ వాదులాడు కోవడంతో సినిమా ఆగిపోయింది. లాక్ డౌన్ ముగిసినా రీస్టార్ట్ కాలేదు. దీంతో శంకర్ రామ్ చరణ్, రణ్వీర్ సింగ్ హీరోలుగా రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేశారు. దీంతో లైకా నిర్మాతలు కోర్టుకెక్కారు.

‘ఇండియన్-2’ పూర్తిచేశాకనే శంకర్ వేరొక సినిమా చేసేలా ఉత్తర్వులు ఇవ్వమని హైకోర్టులో పిటిషన వేశారు. కానీ కోర్టు అలా ఇవ్వడం కుదరదని అంటూ గొడవను సామరస్యంగా తేల్చుకోవాలని ఇరు వర్గాలకు సూచించింది. దీంతో శంకర్ తరపు లాయర్ గత శనివారం నిర్మాతలను కలిశారు. సుదీర్ఘంగా సాగిన చర్చల్లో శంకర్ సినిమాను జూన్ నుండి అక్టోబర్ మధ్యలో కంప్లీట్ చేసి ఇస్తారని లాయర్ తెలుపగా లైకా నిర్మాతలు మాత్రం జూన్ నాటికి సినిమాను ముగించి తీరాలని, ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదని పట్టుబట్టారు. దీంతో సమావేశం సఫలం కాక సమస్య మొదటికే వచ్చింది. దీన్నిబట్టి న్యాయస్థానం ఏదో ఒకటి తేల్చి చెప్తేనే ‘ఇండియన్-2’ ముందుకెళ్ళేలా కనబడుతోంది.

సంబంధిత సమాచారం :