విడుదలకు సిద్దమైన శంకర్ సినిమా టీజర్ !
Published on Jun 7, 2018 4:00 pm IST


హాస్య నటుడిగా పలు సినిమాల్లో మరిచిపోలేని పాత్రలు చేసి ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్న నటుడు షకలక శంకర్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయన నటించిన తాజా చిత్రం ‘శంభో శంకర’. ఈ సినిమాను శ్రీధర్.ఎన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఇప్పుడు టీజర్ విడుదలకానుంది.

ఈ నెల 8వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు ఈ టీజర్ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ విడుదల జరగనుంది. వై.రమణా రెడ్డి, సురేష్ కొండేటిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తుండగా రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ చిత్రంతో షకలక శంకర్ హీరోగా ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook