శ్రీహ‌రిగారికి డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోసం చేశారు – శాంతి శ్రీహ‌రి

Published on Sep 26, 2022 11:04 am IST

దివంగత నటుడు శ్రీహ‌రి హీరోగా సక్సెస్, విల‌న్‌ గా సక్సెస్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా సక్సెస్. ఆయన తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసి తెలుగు వెండితెర పై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఐతే, శ్రీహ‌రి తన కెరీర్ పీక్స్‌ లో ఉన్న టైమ్ లోనే ముంబైలోని ప్రమాదవశాత్తూ ఓ హాస్పిట‌ల్ లో చనిపోయారు. కాగా తాజాగా శ్రీహ‌రి స‌తీమ‌ణి శాంతి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీహ‌రి సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

ఇంతకీ శాంతి ఏం మాట్లాడారు అంటే.. ఆమె మాటల్లోనే.. ‘శ్రీహ‌రి గారికి రావాల్సిన రెమ్యున‌రేష‌న్స్ క‌రెక్ట్‌ గా వచ్చి ఉండి ఉంటే.. మేం మ‌రో 10 ఇళ్లు కొనే వాళ్ళం. కానీ, చిరంజీవిగారి సంస్థతో పాటు మ‌రో రెండు, మూడు సంస్థ‌లే శ్రీహ‌రిగారికి కరెక్ట్ గా రెమ్యున‌రేష‌న్‌ ఇచ్చాయి. చాలా మంది నిర్మాతలు ఆయనకు డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోసం చేశారు. బావ‌కి (శ్రీహరి) సినిమా అంటే పిచ్చి. అందుకే.. ఆయన డ‌బ్బులు కంటే కూడా సినిమాల గురించే ఎక్కువ ఆలోచించేవారు. ఇక శ్రీహ‌రిగారు చ‌నిపోయిన త‌ర్వాత ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఓసారి బాల‌కృష్ణ‌గారు మాత్రం ఫోన్ చేసి.. యోగక్షేమాలు అడిగారు” అని శాంతి చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :