స్టార్ హీరో కూతురు పొట్టి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

Published on Nov 18, 2019 11:30 pm IST

కింగ్ ఖాన్ షారుక్ కుమార్తె సుహానా ఖాన్ నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఓ షార్ట్ ఫిలిం లో నటించడం జరిగింది. ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో సుహానా ఖాన్ యాక్ట్ చేసింది. ప్రస్తుతం న్యూయార్క్ లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తున్న సుహానా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కలవు. పది నిమిషాల నిడివిగల ది గ్రే పార్ట్ ఆఫ్ ది బ్లూ షార్ట్ ఫిలిం లో సుహానా చక్కని ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

ఇక షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చదువుకొంటున్నారు. త్వరలోనే అతను కూడా తెరంగేట్రం చేసే అవకాశం కలదు.కాగా షారుక్ కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. గత ఏడాది ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రం జీరో అనూహ్యంగా పరాజయం పాలైంది. దీనితో ఆయన సినిమాలకు లాంగ్ బ్రేక్ ప్రకటించారు. ఇటీవల ఆయన తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :