ఇద్దరు బడా దర్శకులతో స్టార్ హీరో చిత్రాలు?

Published on Oct 17, 2019 4:14 pm IST

ఒకప్పుడు బాలీవుడ్ బాద్షాగా వెలుగొందిన షారుక్ ఖాన్ వరుస పరాజయాలతో రేస్ లో వెనుకబడ్డాడు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన చిత్రాలేవీ విజయ తీరాలు చేరలేదు. ఎంతో శ్రమకోర్చి మరుగుజ్జు పాత్రలో నటించిన మూవీ జీరో కూడా అనూహ్యంగా పరాజయం పాలైంది. దీనితో షారుక్ ఎటువంటి మూవీ చేయాలనే విషయం పై సందిగ్ధంలో పడ్డారు. అందుకే ఆయన అధికారికంగా కొద్దిరోజులు బ్రేక్ ప్రకటించారు. కాగా ఆయన పుట్టిన రోజు కానుకగా రెండు బడా ప్రాజెక్ట్స్ ని ఆయన ప్రకటించనున్నారని తాజా సమాచారం.

వచ్చేనెల 2న షారుక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేస్తున్న రెండు చిత్రాలు ప్రకటిస్తారు. అందులో ఒకటి రాజ్ కుమార్ హిరానీ చిత్రం కాగా, మరొకటి ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ అట. ఈ ఇద్దరు బడా దర్శకులతో షారుక్ రెండు చిత్రాలు చేయనున్నారని సమాచారం. బాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా పేరున రాజ్ కుమార్ హిరానీ హిందీలో 3 ఇడియట్స్, పీకే, సంజు వంటి ఇండస్ట్రీ హిట్స్ నిర్మించారు. ఇక భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ కి దేశవ్యాప్తంగా పేరుంది. మరి ఇలాంటి ఇద్దరు పెద్ద దర్శకులతో షారుక్ చేయబోయే చిత్రాలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :

More