శర్వానంద్ కొత్త చిత్రం ప్రారంభం !
Published on Nov 23, 2017 1:44 pm IST

వరుస సక్సెస్ సినిమాలతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో శర్వానంద్ తాజా చిత్రం ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యింది. హను రాగావపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై ప్రసాద్ చుక్కపల్లి , సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిల్ రాజు క్లాప్ కొట్టి ప్రారంభించిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకుడు సుకుమార్ తో పాటు పలువురు సినీ ప్రముకులు విచ్చేశారు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా ఈ సినిమాలో హీరొయిన్ ను ఖరారు చెయ్యనప్పటికి సాయి పల్లివి పేరు వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంభందించిన ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు మీడియాతో పంచుకోనున్నారు చిత్ర యూనిట్.

 
Like us on Facebook