కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేసిన శర్వానంద్!

shatamanam-bhavathi
గతేడాదిలానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పెద్ద సినిమాల మధ్యన వచ్చి కూడా హిట్ కొట్టేశారు యువహీరో శర్వానంద్. ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పెద్ద సినిమాల మధ్యన వచ్చిన ఆయన నటించిన శతమానం భవతి అనే సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే 20 కోట్ల రూపాయల షేర్ మార్క్‌కు దగ్గరైన ఈ సినిమా లాంగ్‌రన్‌లో 25 కోట్ల రూపాయల వరకూ వసూలు చేస్తుందని ట్రేడ్ భావిస్తోంది. శర్వానంద్ కెరీ‌ర్‌కు ఇదే అతిపెద్ద హిట్‌గా చెప్పుకోవచ్చు.

దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు పండగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు, రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఇప్పుడు శతమానం భవతి ఇలా వరుస హిట్స్‌తో యువ హీరోల్లో శర్వానంద్ తనదైన మార్క్ సృష్టించుకోగలిగారనే చెప్పాలి.