శర్వానంద్ స్పీడు మాములుగా లేదు.

Published on Aug 28, 2019 12:14 pm IST

హీరో శర్వానంద్ చడీచప్పుడు లేకుండా నేడు ఓ కొత్త సినిమా సినిమా ప్రారంభించేశారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ జంటగా కొత్త దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కిస్తుండగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతుంది. నేడు చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు సమకూర్చడం విశేషం. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ చిత్రంలో ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

ఇటీవల రణరంగం చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన శర్వా, తమిళంలో ఘనవిజయం సాధించిన 96 తెలుగు రీమేక్ తోపాటు, శ్రీకరం అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. తాజాగా నేడు ఆయన మూడవ చిత్రాన్ని మొదలు పెట్టారు. వరుసగా సినిమాలు చేస్తూ శర్వానంద్ పరిశ్రమలో దూసుకుపోతున్నారు.

సంబంధిత సమాచారం :