తమిళ దర్శకుడి తో తెలుగు యువ హీరో !

తమిళ దర్శకుడి తో తెలుగు యువ హీరో !

Published on Nov 4, 2018 10:00 PM IST

sharwanand2
యువ హీరో శర్వానంద్ తమిళ డైరెక్ట్ తిరు దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ దర్శకుడు విశాల్ తో ఎక్కువగా సినిమాలను తెరకెక్కించాడు. ఇక ఇటీవల తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలను హ్యాండిల్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. మరి శర్వా ఏ నమ్మకంతో ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడో.

ఇక శర్వా ప్రస్తుతం రెండు సినిమాల్తో బిజీ గా వున్నాడు. దాంట్లో ఒకటి ‘పడి పడి లేచె మనసు’ ఈచిత్రంలో శర్వా, సాయి పల్లవితో కలిసి నటిస్తున్నాడు. ఈచిత్రం డిసెంబర్ 21న విడుదలకానుంది. ఇక ఈచిత్రం తో పాటు ఆయన ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు . ఈచిత్రం పూర్తి చేసిన తరవాత తిరు తో చేయబోయే చిత్రాన్ని మొదలుపెట్టానున్నాడు శర్వా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు