రెండు సినిమాల్ని ఒకేసారి చేయనున్న శర్వానంద్ !
Published on Nov 21, 2017 9:17 am IST

యంగ్ హీరో శర్వానంద్ చాలా జాగ్రత్తగా కథల్ని ఎంచుకుంటూ పెద్ద పెద్ద సినిమాలతో సైతం పోటీపడి భారీ విజయాల్ని అందుకుంటున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘శతమానంభవతి, మహానుభావుడు’ చిత్రాలు ఘన విజయాల్ని సాధించడంతో యువ దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి, సుధీర్ వర్మలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు.

ఈ రెండు సినిమాలు ఈ నెలలోనే అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే శర్వా ఈ రెండు సినిమాల చిత్రీకరణలోను ఒకేసారి పాల్గొంటారని తెలుస్తోంది. వీటిలో హను రాఘవపూడి చిత్రం పూర్తిస్థాయి లవ్ స్టోరీగా ఉండనుంది. నాగ వంశీ నిర్మించనున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది. ఇకపోతే సుధీర్ వర్మ సినిమాకు సంబందించి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook