శర్వానంద్ పాత్రలో ఇన్ని షేడ్స్ ఉంటాయా !

Published on May 24, 2019 8:00 pm IST

యువ హీరో శర్వానంద్ తాజాగా సుధీర్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. అదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులే అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీంతో టీమ్ రేపు సాయంత్రం 4:05 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని నిర్ణయించి కొద్దిసేపటి క్రితమే ప్రీ లుక్ రిలీజ్ చేశారు.

ఈ ప్రీలుక్ చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా శర్వా పాత్రను కూడా పరిచయం చేసింది. సినిమాలో శర్వా పాత్ర రాడికల్ బిహేవియర్ కలిగి ఉంటుందని, అలాగే పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేయగల సూక్ష్మ బుద్ది కలగలిసి ఒక అసాధారణమైన వ్యక్తిలా ఉంటుందని టీమ్ చెబుతోంది. మరి కథానాయకుడి పాత్రలోనే ఇన్ని లక్షలున్నాయంటే సినిమాలో ఇంకెన్ని ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More