పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమాకు ఈమె ఫిక్సేనా.?

Published on Nov 26, 2020 8:00 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్టులలో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడితో చేస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి. అలాగే పవన్ ఫ్యాన్స్ కూడా అత్యధికంగా ఎదురు చూస్తున్న సినిమా కూడా ఇదే. వీరిద్దరి నుంచి ఊహించని కాంబో అలాగే పవన్ ఇంతవరకు టచ్ చెయ్యని జానర్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజుల కితమే ఓ బజ్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ ను అనుకుంటున్నారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇపుడు దీనిపై మరింత బలమైన టాక్ వినిపిస్తుంది. మేకర్స్ దృష్టిలో పవన్ సరసన ఈమె అయితేనే కరెక్ట్ అని మెయిన్ ఫిమేల్ లీడ్ కు నిధిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More