చైతూ సాయి పల్లవి, ప్రేమికులరోజు పలకరిస్తారట

Published on Oct 10, 2019 8:28 am IST

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల ఫిదా మూవీతో చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వరుణ్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఆ చిత్రంలో ఆట్టిట్యూడ్ కలిగిన తెలంగాణా పల్లెటూరి పిల్లగా సాయి పల్లవి నటన, డాన్సులు తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. శేఖర్ కమ్ముల నాగ చైతన్య తో చేస్తున్న ఈచిత్రంలో కూడా సాయి పల్లవినే తీసుకున్నారు. కొద్దినెలల క్రితం మొదలైన ఈ చిత్ర షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదల చేయాలనీ భావిస్తున్నారట దర్శకుడు.

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రం ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయడం మంచిదని దర్శకుడు భావిస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం నాగ చైత్యన, వెంకటేష్ తో కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ వెంకీమామ విడుదలకు సిద్ధంగా ఉంది. రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More