ముందు అనుకున్న టైంకే రానున్న ‘షేర్’

ముందు అనుకున్న టైంకే రానున్న ‘షేర్’

Published on Oct 19, 2015 7:20 PM IST

sher
ఈ ఏడాది మొదట్లోనే పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘పటాస్’ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత ఓ సూపర్ హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది మరో సినిమాతో సందడి చేయడానికి సిద్దమయ్యాడు. అదే ‘షేర్’. ముందుగా ఈ సినిమాని అక్రోబార్ 30న రిలీజ్ చెయ్యలనీ అనుకున్నారు. దాని ప్రకారమే వర్క్ కూడా జరుగుతోంది. కానీ సడన్ గా ‘అఖిల్’ సినిమా వాయిదా పడడంతో ఒకవారం ముందుగానే అనగా అక్టోబర్ 22నే రావాలని నిర్ణయించుకున్నారు.

కానీ అఖిల్ వెనక్కి వెళ్ళడంతో సడన్ గా మరో మూడు సినిమాలు కూడా అక్టోబర్ 22న రిలీజ్ కావడానికి సిద్దమయ్యాయి. దాంతో హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ ని ఫినిష్ చేసి లో పబ్లిసిటీతో సినిమాని ఎందుకు రిలీజ్ చేయడం అని భావించిన ఈ చిత్ర టీం మళ్ళీ ముందుగా అనుకున్న అక్టోబర్ 30వ తేదీకే ఫిక్స్ అయ్యింది. దానికి తగ్గట్టుగానే మరో రెండు రోజులు టైం తీసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పర్ఫెక్ట్ గా ఫినిష్ చేస్తున్నారు. ఎస్ఎస్ తమన్ అందించిన ఆడియోని ఇటీవలే ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు.

సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ ని కూడా టచ్ చేసారట. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కొమర వెంకటేష్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు