రేపు ‘షేర్’ సెన్సార్ కి వెళ్ళనుందా.?

రేపు ‘షేర్’ సెన్సార్ కి వెళ్ళనుందా.?

Published on Oct 18, 2015 9:50 AM IST

sher
ఈ ఏడాది పవర్ఫుల్ పోలీస్ ఎంటర్టైనర్ ‘పటాస్’ తో అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఈ సూపర్ హిట్ తో ఫుల్ ఫాంలోకి వచ్చిన కళ్యాణ్ రామ్ అప్పుడే తన తదుపరి సినిమా ‘షేర్’ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే తారక్ చేతుల మీదుగా షేర్ ఆడియోని రిలీజ్ చేసారు. అలాగే సినిమాని అక్టోబర్ 30న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు.

కానీ దసరా బరి నుంచి అఖిల్ సినిమా తప్పుకోవడం వలన షేర్ సినిమాని ఒక వారం ముందే అనగా అక్టోబర్ 22నే రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా శరవేగంగాఫినిష్ చేస్తున్నారు. ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రికల్లా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ఫినిష్ చేసి రేపు సెన్సార్ కి పంపనున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాక ఒకేసారి రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. మరి అక్రోబార్ 22న వస్తారా లేక అనుకున్నట్టుగానే అక్టోబర్ 30కె వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు