జనవరి 1న ‘45’ గ్రాండ్ రిలీజ్ – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర

45 Movie

కన్నడ అగ్ర కథానాయకులు శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘45’. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.రమేష్ రెడ్డి భారీగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈవెంట్‌లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “అర్జున్ జన్య చెప్పిన కథ, ఇంటర్వెల్, క్లైమాక్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భూమిపై ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించాలని, ఉన్నన్నాళ్లు సంతోషంగా బతకాలని ఈ సినిమా సందేశం ఇస్తుంది. ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.

రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు. అర్జున్ జన్య స్క్రీన్ ప్లే అద్భుతంగా రాశారు. శివన్నను మునుపెన్నడూ చూడని రీతిలో చూపించారు. తెరపై ఆయన విధ్వంసం సృష్టించారు” అని ప్రశంసించారు. గరుడ పురాణం ఆధారంగా, ఒక కొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో చూడవచ్చని, ఇంటర్వెల్ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.

Exit mobile version