కమల్ కామెంట్స్ పై శివరాజ్ కుమార్ రియాక్షన్ !

కమల్ కామెంట్స్ పై శివరాజ్ కుమార్ రియాక్షన్ !

Published on Jun 3, 2025 12:03 AM IST

s Kamal Haasan

‘థగ్‌ లైఫ్‌’ ఈవెంట్‌లో కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే, అదే ఈవెంట్‌ లో కమల్‌ హాసన్ కన్నడ భాష గురించి మాట్లాడే సమయంలో ఆ కామెంట్స్ కు శివరాజ్ కుమార్‌ చప్పట్లు కొట్టారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల పై శివరాజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తాను ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ, శివ రాజ్ కుమార్ ఏం మాట్లాడారు అంటే.. ‘అన్ని భాషలు ముఖ్యమైనవే. కానీ, నా మాతృభాష కన్నడకే ప్రాధాన్యం ఇస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు’ అని శివ రాజ్ కుమార్ చెప్పారు.

శివరాజ్ కుమార్ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఇంతకుముందు కూడా ఇదే చెప్పాను. కన్నడ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. కానీ, నేను కమల్‌ హాసన్‌ క్షమాపణలు చెప్పాలనే విషయం గురించి చెప్పకూడదు. ఎందుకంటే ఆయన చాలా సీనియర్‌ నటుడు. నేను ఆయనకు వీరాభిమానిని. ఇక ఆ ఈవెంట్‌లో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఆ వ్యాఖ్యల సమయంలో చప్పట్లు కొడుతున్నట్లు చూపించారు. నేను అప్పుడు క్లాప్స్‌ కొట్టలేదు. వేరే స్పీచ్‌ సమయంలో కొట్టాను. అది ఎడిటింగ్‌లో అలా వచ్చింది’ అని ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు