వైష్ణవ్ తేజ్ మూడో చిత్రంలొకి మరో ముద్దుగుమ్మ..!

Published on Aug 14, 2021 1:00 am IST

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ “ఉప్పెన” చిత్రం ద్వారా మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే వైష్ణవ్ తేజ్ తన రెండో చిత్రాన్ని దర్శకుడు క్రిష్‌తో చేస్తుండగా, మూడో చిత్రాన్ని దర్శకుడు గిరీశయ్యతో చేస్తున్నాడు. గిరీశయ్యతో చేస్తున్న సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోకి మరో హీరోయిన్ అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మేకర్స్ హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న శోభితా రానాను తీసుకున్నారట. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెట్స్‌లో చేరిన శోభితా రానా మాట్లాడుతూ ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం అని నేను అనుకుంటున్నానని శోభితా రానా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :