ఆర్ ఆర్ ఆర్ పాటల రచయితకు రాజమౌళి షాకింగ్ కమాండ్స్

Published on Oct 21, 2019 8:30 am IST

రాజమౌళి ఎంతగా గొప్ప చిత్రాలు తీస్తాడో, ఆ చిత్రాలకు సంబందించిన విషయాలు చిత్రీకరణ సమయంలో బయటపడకుండా అంతే జాగ్రత్తపడతాడు. ఐదేళ్ల వరకు చిత్రీకరణ సాగిన బాహుబలి చిత్రాల గురించి విడుదలయ్యేవరకు కూడా ఆ చిత్రాల గురించిన ఎటువంటి కీలక విషయాల బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టార్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ కి ముందే ఆర్ ఆర్ ఆర్ కథేమిటనే విషయాన్నిపత్రికా ముఖంగా రివీల్ చేసిన రాజమౌళి తారక్, రామ్ చరణ్ ల లుక్స్ మాత్రం, సెట్స్ నుండి ఎవరు లీక్ చేయకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు.

సీనియర్ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజా ఈ చిత్రంలో మూడు పాటలు రాశారట. ఒక పాట రాయాలంటే రచయితకు మూవీ కథకు సంభవించిన సన్నివేశం, పాత్రలు తీరు, దానివెనుక నేపథ్యం అన్నీ చెప్పాల్సి ఉంటుంది. మరి మూడు పాటలు రాసిన అశోక్ గారికి మూవీపై చాలా అవగాహన వచ్చి ఉండాలి. ఐతే ఈ మూడు పాటలలోని కనీసం ఒక చరణం, కానీ పల్లవి కానీ మీ భార్యతో కూడా చెప్పకూడని నిభందన పెట్టారట రాజమౌళి. ఈ విషయాన్ని రచయిత అశోక్ తేజా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More