‘రంగస్థలం’ రన్ టైమ్ కొద్దిగా ఎక్కువే !

త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్న భారీ చిత్రాల్లో ‘రంగస్థలం’ కూడ ఒకటి. రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశారు. 1980ల కాలంలో నడిచే పల్లెటూరి కథగా ఉండనున్న ఈ చిత్రంలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటించడంతో అందరిలోను సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇది మాత్రమే గాక ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశం మరోకటి కూడా ఉంది.

అదే సినిమా రన్ టైమ్. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిముషాలు ఉంటుందట. ఎంతో బలమైన కంటెంట్ ఉంటే తప్ప దర్శకులు ఇంత నిడివిలో ఫైనల్ కాపీని సిద్ధం చేయరు. అలాంటిది సుకుమార్ ధైర్యంగా రెండున్నర గంటల కంటే ఎక్కువ లెంగ్త్ ఉన్న సినిమాతో వస్తున్నారంటే సినిమాలో గొప్ప విషయమే ఉండుండాలి. మరి ఈ విషయం ఏ పాటిదో తెలియాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్ ను రేపు సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకలో రిలీజ్ చేయనున్నారు.