షాకింగ్ – నటి టబు ఇన్స్టాగ్రామ్ హ్యాక్..ఎలాంటి పోస్ట్ పడిందో తెలుసా?

Published on Jan 17, 2021 5:29 pm IST

సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాకింగ్ కోసం ఎప్పుడూ ఏదొక సందర్భంలో మనం వింటూనే ఉంటాము. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకు చెందిన ఎంతో మంది ఈ అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆ మధ్య స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, లేటెస్ట్ “క్రాక్”లో జయమ్మగా కనిపించిన టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈలోపే ఈరోజు హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా అకౌంట్ లు హ్యాక్ అయ్యిన వార్తలు విన్నాము.

ఇప్పుడు లేటెస్ట్ గా మరో స్టార్ నటి ఈ జాబితాలో చేరిపోయారు. ఆమెనే సీనియర్ స్టార్ హీరోయిన్ టబు. లేటెస్ట్ గా మన తెలుగులో బన్నీతో చేసిన “అల వైకుంఠపురములో’ సినిమాలో కనిపించి మెప్పించిన ఈమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది.

అది ఎలా కన్ఫర్మ్ అయ్యింది అంటే దగ్గరగా 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈమె ఖాతా నుంచి మొబైల్ లో బోర్డింగ్ గేమ్స్ ఆడుతు ఇంత సంపాదించండి అంటూ ఓ వాట్సాప్ నెంబర్ పెట్టిఅసలు ఆమెకు సంబంధం లేని పోస్ట్ పడింది. దీనితో ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యినట్టుగా నెటిజన్స్ నిర్ధారణ చేసేసారు. ఈరోజే మరో సెలెబ్రెటీ అకౌంట్ హ్యాక్ అవ్వడం ఆశ్చర్యకరం.

సంబంధిత సమాచారం :

More