కలకత్తా సెట్ లో షూట్ స్టార్ట్ !

కలకత్తా సెట్ లో షూట్ స్టార్ట్ !

Published on Oct 18, 2020 7:06 PM IST

టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’, కాగా ఈ సినిమా పాతతరం కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. అందుకే హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా కలకత్తా నేపథ్యాన్ని తీసుకురావడానికి సెట్ వేశారు. రేపటి నుండి ఆ సెట్ లోనే షూట్ చేయనున్నారు. కాగా ఈ సినిమా కథ కాస్త ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందట.

ఇక ఈ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోబోతున్నారు. సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మరో ముప్పై ఐదు రోజుల్లో ఈ సినిమా పూర్తి అవుతుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు