96 తెలుగు రీమేక్ షూటింగ్ అప్ డేట్ !

Published on Jan 26, 2019 12:45 pm IST


కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ’96’ తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ లో శర్వానంద్ , సమంత హీరో హీరోయిన్లుగా నటించనుండగా ఓరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నాడు. తెలుగులో ఆయనకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. తాజాగా ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం మార్చి నుండి షూటింగ్ జరుపుకోనుంది.

ఇక కోలీవుడ్లో విజయ్ సేతుపతి ,త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మరి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ తెలుగులో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More