నాని పక్కన ‘యూటర్న్‌’ హీరోయిన్ !

Published on Oct 13, 2018 12:51 pm IST


‘మళ్ళీ రావా’ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో నాని ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో.. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నాని సరసన నటించబోయే హీరోయిన్ని ఫైనల్ చేసిందట చిత్రబృందం.

కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌.. జెర్సీలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. సితారఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :