మగ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్ !

Published on May 23, 2021 1:00 am IST

స్టార్ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ ఈ రోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయా పోస్ట్ చేస్తూ.. ‘ఈ రోజు మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంలో మునిగితేలుతున్నాం’ అంటూ శ్రేయా చెప్పుకొచ్చింది.

మొత్తానికి తనకు పుట్టిన బాబు గురించి తన అభిమానులతో, సన్నిహితులతో పంచుకుంటూ శ్రేయా ఘోషల్‌ తెగ మురిసిపోతుంది. ఇక తన బిడ్డకు మీరందరు ఇచ్చే లెక్కలేనన్ని ఆశ్వీర్వాదాలకు నా ధన్యవాదాలు అంటూ ఆమె తెలిపింది. ఇక శ్రేయా ఇటీవల బేబీ షవర్‌ కార్యక్రమానికి సంబంధించిన తన బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌ చేయడం, అవి బాగా వైరల్ అవ్వడం తెలిసిందే. ఇక హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో శ్రేయా అలరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :