శ్రియ పెళ్లి చేసుకోవడంలేదట !

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ శ్రియ శరన్ వచ్చే నెలలో తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు నిన్నంతా మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. కొందరైతే రాజస్థాన్లో పెళ్లంటూ ఈ వార్తను కన్ఫర్మ్ చేసేశారు కూడ. కానీ శ్రియ మాత్రం ఈ వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు.

ఆమె తల్లి నీరజ కూడా ఇదే అన్నారు. శ్రియ పెళ్లి చేసుకోనుందనే పుకారు ఎలా పుట్టిందో తెలీడంలేదు. నిజానికి శ్రియ వచ్చే నెలలో రాజస్థాన్లో జరగనున్న స్నేహితురాలై పెళ్లి వేడుకకు హాజరుకానుందని, అందుకే కాస్ట్యూమ్స్, ఆభరణాలు కొనుగోలుచేశారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో శ్రియ నటించిన ‘గాయత్రి’ ఈ నెల 9న రిలీజ్ కానుండగా ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే తమిళంలో ‘నరగసూరన్’ చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది.