బాలయ్యకు జోడీగా లక్కీ హీరోయిన్ ?

Published on May 7, 2021 3:00 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ‘క్రాక్’ సినిమాతో గోపిచంద్ మలినేని ఇటీవలే సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో ఆయనకు బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. అందుకే గోపిచంద్ పకడ్బందీగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.

యాధార్థ ఘటనల ఆధారంగా వీరి చిత్రం ఉండనుంది. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది. అందుకే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు. వారిలో ఒకరు శ్రుతిహాసన్ అనే టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ మలినేనికి శ్రుతిహాసన్ లక్కీ హీరోయిన్. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ మూలానే ఆయన బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ ను తీసుకొస్తున్నారట. రెండవ కథానాయకిగా ఎవరు నటిస్తున్నారో చూడాలి. ‘అఖండ’ పూర్తయ్యాక, కరోనా సిట్యుయేషన్ అదుపులోకి వచ్చాక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :