కాస్త లేటైనా శృతి హాసన్ కూడా వచ్చేసింది..!

11th, October 2016 - 04:17:31 PM

premam-in
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన విడుదలై హిట్ దిశగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. మొదటి రోజునుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పటికే అంతటా మంచి ఓపెనింగ్స్ సాధించగా, దసరా సెలవుల్లో కూడా కలెక్షన్స్ అదే స్థాయిలో ఉన్నాయి. ఇక సీజన్లో సినిమాను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రేమమ్ టీమ్ ప్రచార కార్యక్రమాలను ఎక్కడ ఆపకుండా నిర్వహిస్తోంది.

అదేవిధంగా ఇతర సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉండడంతో ప్రేమమ్ ప్రమోషన్స్‌లో ఇప్పటివరకూ భాగం కాలేకపోయిన హీరోయిన్ శృతి హాసన్ కూడా నిన్నట్నుంచి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. లండన్ నుంచి నేరుగా హైద్రాబాద్ వచ్చేసిన ఆమె ప్రస్తుతం అక్కినేని అన్నదమ్ములు నాగ చైతన్య, అఖిల్‌లతో కలిసి ప్రేమమ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. చైతన్య సరసన శృతి హాసన్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు.