అందరూ నో చెప్తే పవన్ నాకు ఎస్ చెప్పారంటున్న శృతి హాసన్ !


తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్’ వంటి సినిమాల్ని చేసినా కూడా నటి శృతి హాసన్ కు చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. దీంతో చాలా మంది ఆమెను ఐరన్ లెగ్ , ఆమె ప్రాజెక్టులో ఉంటే కలిరాదు అని రకరకాల కామెంట్స్ చేశారు. దీంతో తెలుగులో ఆమె కెరీర్ కు ఆదిలోనే ఫులుస్టాప్ పడిపోయిందని అనుకునేలోపు ‘గబ్బర్ సింగ్’ లాంటి భారీ హిట్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అయిపొయింది శృతి హాసన్.

ప్రస్తుతం పవన్ సరసన ‘కాటమరాయుడు’ చిత్రంలో నటిస్తున్న ఆమె ఫ్లాపుల్లో ఉన్న తనకు గబ్బర్ సింగ్ ఛాన్స్ ఎలా వచ్చిందో గుర్తు చేసుకుంది. తను పరాజయాల్లో ఉండటం వలన ఏ హీరో, దర్శకుడు కూడా తనతో వర్క్ చేయడానికి ఇంటరెస్ట్ చూపించలేదని కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాకు తన పేరుని ప్రపోజ్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పి ఆమె చేస్తుందని చెప్పారని, అదే తన కెరీర్ కు పెద్ద మలుపని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.