నెక్స్ట్ లెవెల్లో “శ్యామ్ సింగ రాయ్” టీజర్.!

Published on Nov 18, 2021 10:13 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మరో లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ కథాంశంతో తెరకెక్కింది. మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసారు.

ఇది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఫస్ట్ షాట్ నుంచి ఈ టీజర్ లో కనిపించిన ప్రతీ విజువల్ కూడా చాలా గ్రాండ్ గా అదిరే లెవెల్లో కనిపిస్తుంది. అలాగే సినిమా బ్యాక్ డ్రాప్ కానీ అందులోని నిహారికా ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఇస్తున్నాయి.

“శ్యామ్ సింగ రాయ్” గా నాని చెప్పిన డైలాగ్ కానీ సినిమా పై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు డిఫరెంట్ టైం లైన్స్ డిఫరెంట్ లుక్స్ లో నాని సాయి పల్లవి, కృతి శెట్టి పై విజువల్స్ మంచి హై కూడా ఇచ్చాయి. ఈ సినిమాతో దర్శకుడు రాహుల్ ఈసారి సాలిడ్ రీసౌండ్ ఇచ్చే హిట్ కొట్టబోతున్నాడు అనిపిస్తుంది.

ఇంకా ఈ టీజర్ లో సను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ కానీ మిక్కీ జె మేయర్ ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ లకి మాత్రం స్పెషల్ మెన్షన్ ఇవ్వాల్సిందే. సిల్వర్ స్క్రీన్ పై నాని కి శ్యం సింగ రాయ్ మాత్రం మంచి కం బ్యాక్ గా నిలవనుంది అని మాత్రం ఫైనల్ గా చెప్పొచ్చు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :