సెన్సేషనల్ సింగర్ నుండి మరో రొమాంటిక్ సాంగ్.

Published on Nov 11, 2019 9:13 pm IST

తన మెస్మరైజింగ్ వాయిస్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు సింగర్ సిధ్ శ్రీరామ్. ఈ మధ్య కాలంలో ఆయన పాడిన చాలా పాటలు యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక అలవైకుంఠపురంలో చిత్రం కొరకు ఆయన పాడిన సామజవరగమనా సాంగ్ ఐతే యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. కాగా సిధ్ శ్రీరామ్ మరో రొమాంటిక్ సాంగ్ పాడారు. సిధ్ శ్రీరామ్ పాడిన ‘చూసీ చూడంగానే’ చిత్రంలోని ‘నీ పరిచయముతో ..’ అనే లిరికల్ సాంగ్ వీడియోని ఈనెల 13న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

శివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్న ‘చూసీ చూడంగానే’ చిత్రాన్ని రాజ్ కందుకూరి ధర్మ పథ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. శేష సింధు రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రానికి గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. చూసీ చూడంగానే చిత్రంలో హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :