ఎక్కడ నుంచి వస్తార్రా మీలాంటోళ్లు ? – సిద్దార్థ్‌

Published on Jul 17, 2021 10:24 pm IST

‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మ‌రిల్లు’తో టాలీవుడ్‌ లో హీరోగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సిద్దార్థ్‌ వయసు పై ఓ నెటిజన్‌ బ్యాడ్ కామెంట్ చేశాడు. అయితే ఆ నెటిజన్ కి ఘటుగా బదులిచ్చాడు సిద్దార్ధ్. ఇంతకీ నెటిజ‌న్ సిద్ధార్థ్‌ వయసుకు సంబంధించి ఏం మెసేజ్ చేశాడంటే.. ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేశాడు.

పైగా సిద్దార్ధ్ కే ట్యాగ్ చేశాడు. మొత్తానికి ఈ టీట్‌ చూసిన సిద్ధార్థ్‌ ఆ నెటిజన్ పై సీరియస్ అవుతూ.. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌ లో ఫస్ట్ నేనే గుర్తొచ్చానురా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ కాస్త సీరియస్ గానే రిప్లేయ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ టీట్‌ వైరల్‌ అవుతుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్దార్ధ్ ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ‘మహాసముద్రం’ చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :