ఏప్రిల్ నెల్లోనే.. ‘దిల్‌రాజు’ సినిమా!

ఏప్రిల్ నెల్లోనే.. ‘దిల్‌రాజు’ సినిమా!

Published on Mar 31, 2015 12:21 AM IST

Dil-Raju
గత కొంతకాలంగా తెలుగులో సినిమాలేవీ చేయని సిద్ధార్థ, తమిళంలో మాత్రం వరుస సినిమాలతో మంచి జోరు మీదున్నాడు. 2014లో సిద్దార్థ్ హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘జిగర్‌తండా’. పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత సంవత్సరం ఆగష్టు ఒకటిన విడుదలైంది. ఇక తమిళంలో విడుదలైన రోజునుంచే ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు కానీ అది కుదర్లేదు. చివరకు ఇప్పటికి ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యేందుకు అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుంది. ‘దిల్‌రాజు’ పేరుతో ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. దమ్ముంటే కాస్కో అన్నది ట్యాగ్‌లైన్.

ఈ సినిమాకి కథ, మేకింగ్ స్టైల్‌, సిద్దార్థ్‌ల నటన ఒక ఎత్తైతే.. సినిమాలో కీలక పాత్ర పోషించిన బాబీ సింహ నటన మరో ఎత్తు. ఇదే సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా బాబీ సింహ జాతీయ అవార్డును కూడా అందుకోవడం విశేషం. కాగా తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ఏప్రిల్ నెల్లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయాలన్నది ఆలోచన. ఈ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని సిద్ధార్థ్ భావిస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు