బాలీవుడ్‌లో రీమేక్ కానున్న సిద్ధార్థ్ సినిమా!

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న సిద్ధార్థ్ సినిమా!

Published on May 19, 2015 6:10 PM IST

chikkadu dhorakadu stills (2)
గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి తమిళంలో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ ఏర్పరచుకునే పనిలో పడ్డాడు సిద్ధార్థ్. ఈ క్రమంలోనే తమిళంలో ‘జిగర్‌తండా’, ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాల్లో ‘ఎనక్కుల్ ఒరువన్’, ‘నాలో ఒకడు’ పేరుతో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే! అదేవిధంగా ‘జిగర్‌తండా’ కూడా ‘దిల్‌రాజు’ పేరుతో విడుదలకు సిద్ధమైంది.

ఇదిలా ఉంటే.. తాజాగా దిల్‌రాజు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘జిగర్‌తండా’ గత సంవత్సరం ఆగష్టు ఒకటిన విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాద్ వాలా హిందీలో తెరకెక్కించన్నునారని సమాచారం. ఓ ప్రముఖ హీరో ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు