‘డీజే టిల్లు 2’ హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చిన సిద్దు !

Published on Oct 3, 2022 4:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన డీజే టిల్లు చిత్రం సాలిడ్ హిట్ గా నిలిచింది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ సీక్వెల్ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గురించి సిద్దు జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుందని.. అందుకే ఆమె ప్లేస్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించబోతుందని సిద్ధూ చెప్పాడు.

ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజ్ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. సిద్ధు జొన్నలగడ్డ కి మరో భారీ హిట్ రావడం ఖాయం అంటున్నారు. మరీ ఫస్ట్ పార్ట్ లో తన నటనతో ఆకట్టుకున్న నేహాశెట్టి పాత్ర ఈ సీక్వెల్ లో కూడా ఉంటుందో ఉండదో చూడాలి. ఏది ఏమైనా సిద్ధూ కెరీర్ లోనే డీజే టిల్లు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :