హిట్ డైరెక్టర్ ఇంట్రస్టింగ్ మల్టీస్టారర్ !

Published on Jul 19, 2019 3:20 pm IST

“ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ఈ చిత్రం బాక్స్ అఫీస్ వద్ద మంచి హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో అజ‌య్ భూప‌తి తరువాత సినిమా పై కూడా భారీ అంచనాలు పెరిగాయి. కాగా అజేయ్ భూపతి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో తన రెండో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అని టైటిల్ పెట్టినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అప్పట్లో క్లాస్ హీరో అనిపించుకున్న సిద్ధార్థ్ ను ఈ సినిమాలో మరో హీరోగా తీసుకున్నారట. మొత్తానికి రవితేజ – సిద్ధార్థ్ కాంబినేషనే కొత్తగా ఉంది. పైగా ఈ మధ్య సిద్ధార్థ్ తెలుగు సినిమాలు చెయ్యలేదు. వరుసగా తమిళ సినిమాలే చేస్తున్నాడు. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందట.

కాగా ఈ సినిమాలో రవితేజకి జోడిగా అదితిరావు హైదరీ నటించనుంది. సెప్టెంబర్ మొదటి వారం నుండి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :