సెప్టెంబర్‌లో సైమా వేడుక.. అవార్డు రేసులో ముందున్న మహేశ్ సినిమా..!

Published on Aug 16, 2021 9:24 pm IST

దక్షిణాదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) వేడుక కరోనా కారణంగా మూడేళ్లుగా జరగలేదు. 2019కి సంబంధించి సైమా పురస్కారాల ప్రదానోత్సవాలు వచ్చే నెల సెప్టెంబర్‌లో ఉండనున్నట్టు సైమా ఛైర్‌ పర్సన్‌ బృందాప్రసాద్‌ ప్రకటించారు. అయితే మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రం 10 నామినేషన్లతో ముందంజలో నిలిచింది.

అయితే మజిలీ 9, జెర్సీ 7 నామినేషన్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘కుంబళంగి నైట్స్‌’కు 13 నామినేషన్లు రాగా, కన్నడ చిత్రం ‘యజమాన’కు 12 నామినేషన్లు, తమిళంలో ధనుష్‌ హీరోగా నటించిన ‘అసురన్‌’కు 10 నామినేషన్లు, కార్తీ నటించిన ‘ఖైదీ’కి 8 నామినేషన్లు వచ్చాయి. అభిమానులు www.siima.in ద్వారా నచ్చిన చిత్రానికి ఓట్లు వేయొచ్చు.

సంబంధిత సమాచారం :