సన్ నెక్స్ట్‌లో ‘సైలెంట్ స్క్రీమ్స్’ స్ట్రీమింగ్.. శృతి హాసన్ వాయిస్‌తో క్రైమ్ డాక్యుమెంటరీ

సన్ నెక్స్ట్‌లో ‘సైలెంట్ స్క్రీమ్స్’ స్ట్రీమింగ్.. శృతి హాసన్ వాయిస్‌తో క్రైమ్ డాక్యుమెంటరీ

Published on Jan 9, 2026 8:00 AM IST

తెలంగాణలోని యథార్థ క్రైమ్ కేసుల ఆధారంగా రూపొందించిన శక్తివంతమైన డాక్యుమెంటరీ ‘సైలెంట్ స్క్రీమ్స్’ ఇప్పుడు సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, ఆ నేరాల వెనుక ఉన్న బాధితుల వేదనను, వారి కుటుంబాల ఆవేదనను ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది.

​ప్రముఖ నటి శృతి హాసన్ ఈ సిరీస్‌కు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఆమె గంభీరమైన స్వరం ఈ కథనానికి మరింత బలాన్ని చేకూర్చింది. కేవలం నేరాలను వివరించడమే కాకుండా, న్యాయం కోసం బాధితులు సాగించిన పోరాటాన్ని ఇందులో లోతుగా ఆవిష్కరించారు. సంక్రాంతి సందర్భంగా ‘జిగ్రీస్’, ‘ముఫ్తీ పోలీస్’ వంటి వినోదాత్మక చిత్రాలతో పాటు, సామాజిక స్పృహ కలిగించే ఇలాంటి వైవిధ్యమైన కంటెంట్‌ను సన్ నెక్స్ట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ప్రస్తుతం 4,000 పైగా టైటిల్స్, 44 లైవ్ ఛానళ్లతో సన్ నెక్స్ట్ తన ఉనికిని చాటుకుంటోంది.

తాజా వార్తలు