హుదూద్ తుఫాన్ విధ్వంసం వల్ల వైఆజ్గ్ తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం దెబ్బతినడంతో తెలుగు చిత్ర పరిశ్రమ వెంటనే స్పందించి అందరూ తమ వంతు సాయం చేసారు. వీరందరిలో మంచు మనోజ్ ముందుగా రియాక్ట్ అవ్వడమే కాకుండా తన టీంతో కలిసి వైజాగ్ వెళ్లి అక్కడ బాధితులకు తమ వంతు సాయం చేసారు.
ఈ విషయంలో మంచు మనోజ్ కి మంచి ఫ్రెండ్ అయిన తమిళ్ హీరో శింబు మాట్టాడు ఇవ్వడమే కాకుండా తనవంతుగా బాధితులకు సాయం చెయ్యడానికి ముందుకు వచ్చాడు. ‘వైజాగ్ బాధితుల కోసమం నా ఫ్రెండ్ మనోజ్ చేస్తున్న అవేర్నెస్ ప్రోగ్రాం మరియు ఫండ్ రైజింగ్ నన్ను ఎంతో ఆనందపడేలా చేసాయి. అందుకే నేను కూడా నా వంతు సాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. నేను కూడా నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్ మరియు ఇండస్ట్రీ వారిని వైజాగ్ బాధితుల కోసం డొనేట్ చేయమని కోరుతానని’ తన సోషల్ బ్లాగ్ ద్వారా తెలియజేశాడు. శింబు తరపున వచ్చేది ఎంత అమౌంట్ అయినా అది వైజాగ్ ప్రాంతానికి చాలా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు.


