నా పెళ్లి ఇప్పుడే కాదంటున్న స్టార్ హీరో !

Published on May 26, 2019 4:34 pm IST

తమిళ స్టార్ హీరో శింబు సోదరుడి వివాహం ఇటీవలే జరిగింది. దీంతో త్వరలో శింబు పెళ్లి కూడా జరగనుందని, బంధువుల అమ్మాయినే ఆయన వివాహమాడనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా వీటిపై శింబు స్పందించారు. తన జీవితంలో మీడియా పాత్ర చాలా ముఖ్యమందని, ఆ మీడియా వల్లనే తనకు ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారని చెప్పుకొచ్చిన ఆయన తన పెళ్లిపై వస్తున్నవన్నీ రూమర్లేనని అన్నారు.

ఆ వార్తల్లో నిజం లేదని, ఇంకా అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదంటూ ఒకవేళ ఏదైనా ఉంటే కొన్ని విశ్వసనీయమైన ఛానెల్స్ ద్వారా అందరికీ తెలియజేస్తానని అన్నారు. అంతేకాదు ఈ మధ్య కొందరు నిర్మాతల్ని, దర్శకుల్ని కలుస్తుండటం వలన సినిమాలపై కూడా రూమర్స్ వస్తున్నాయని, అవి నిజం కాదని తెలిశాక అభిమానులు నిరుత్సాహానికి గురువుతున్నారని అంటూ కొత్త సినిమాలకు సైన్ చేస్తే నిర్మాణ సంస్థల ద్వారానే తెలియజేస్తానని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :

More