ప్రభాస్ ని వెంటాడుతున్నఆ సెంటిమెంట్..!

Published on Jul 10, 2020 6:21 pm IST

ఒకప్పుడు ప్రభాస్ టాలీవుడ్ లో వేగంగా సినిమాలు తీసే హీరోలలో ఒకరిగా ఉండే వాడు. బాహుబలి నుండి ఆయన జోరు తగ్గించారు. మరీ దారుణంగా రెండేళ్లకు ఓ మూవీ చేస్తున్నారు. 2013లో వచ్చిన మిర్చి మూవీ తరువాత ప్రభాస్ బాహుబలి 1 విడుదలకు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నారు.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మొదటి పార్ట్ 2015లో విదులయ్యింది. అలాగే బాహుబలి 2 కోసం మరో రెండేళ్లు పని చేసి 2017లో విడుదల చేశారు. బాహుబలి తరువాత నుండి వేగంగా చిత్రాలు చేస్తానని హామీ ఇచ్చి, సాహో మూవీ కోసం మరో రెండేళ్లు తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ నుండి నెక్స్ట్ మూవీ అయినా త్వరగా, ఏడాదిలో వస్తుందని భావించిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. నేడు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయగా అందులో విడుదల 2021లో అని స్పష్టత ఇచ్చారు. దీనితో రెండేళ్లకు ఒక సినిమా సెంటిమెంట్ ప్రభాస్ ని ఫాలో అయినట్లు అయ్యింది. 2019లో సాహో విడుదల చేసిన ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ 2021లో విడుదల చేయనున్నాడు. ఇక 2020 ముగిసే వరకు రాధే శ్యామ్ పై అప్డేట్స్ కూడా ఉండకపోవచ్చు.

సంబంధిత సమాచారం :

More