కరోనా సోకిన లేడీ సింగర్ బాధ వర్ణనాతీతం

Published on Mar 31, 2020 12:00 am IST

సింగర్ కనికా కపూర్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. లండన్ నుండి తిరిగివచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. దీనితో ఆమెను ఉత్తర్ ప్రదేశ్ లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఉంచి వైద్య సహాయం అందిస్తున్నారు. ఈనెల 9న లండన్ నుండి వచ్చిన ఆమె ఓ హోటల్ లో బస చేయడంతో పాటు, కొందరు ప్రముఖులకు పార్టి ఇచ్చారు అన్న విషయం సంచలం రేపింది.

కాగా ప్రస్తుతం ప్రత్యేక చికిత్స పొందుతున్న కనికా కపూర్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఇంటిని, తన పిల్లలను చాల మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. జీవితం, సమయం చాల విలువైనదని అని చెప్పిన ఆమె, జాగ్రత్తగా ఉండాలని అందరినీ కోరారు. తన క్షేమం గురించి కాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More